ప్లాస్టిక్ బాటిళ్లతో దివ్యాంగుడైన కొడుకు కోసం వినూత్న ఇల్లు నిర్మాణం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Bangladesh
బంగ్లాదేశ్‌లోని లాల్మోనిర్హాట్ జిల్లాకు చెందిన రాషెదుల్ ఆలం, అస్మా ఖాతూన్ దంపతులు పర్యావరణ పరిరక్షణ సందేశాన్నిస్తూ, తమ దివ్యాంగుడైన కుమారుడి కోసం 80 వేల ప్లాస్టిక్ బాటిళ్లతో 1,700 చదరపు అడుగుల విస్తీర్ణంలో అందమైన ఇల్లును నిర్మించారు. ఇసుక నింపిన బాటిళ్లతో గోడలను నిర్మించి నలుగురు పడక గదులు, వంటగదితో కూడిన ఈ వినూత్న ఇంటిని రూపొందించి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.