వైద్య విద్యార్థులకు కీలక అప్డేట్: నీట్ యూజీ సీట్ల కేటాయింపు జాబితా విడుదల

రిపోర్టర్: గోపి స్థలం: న్యూఢిల్లీ

నీట్ యూజీ స్ట్రే వేకెన్సీ రౌండ్ సవరించిన తాత్కాలిక సీట్ల కేటాయింపు జాబితాను మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ తాజాగా విడుదల చేసిందని అధికారులు తెలిపారు. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలు కోరుకునే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా అప్డేట్ చేసిన జాబితాను పరిశీలించుకోవచ్చని స్పష్టం చేశారు. కేటగిరీ లేదా కోటా మారిన అభ్యర్థులు విధిగా తగు ప్రవేశ లాంఛనాలను పూర్తి చేయాలని సూచించారు.