అమెరికాలో వైభవంగా వికసిత్ భారత్ రన్: ప్రవాస భారతీయుల ఉత్సాహం
రిపోర్టర్: శివ
స్థలం: శాన్‌డియాగో
అమెరికాలోని కాలిఫోర్నియా శాన్‌డియాగోలో వికసిత్ భారత్ రన్ - 2026 కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించినట్లు లాస్ ఏంజెల్స్ కన్సులేట్ జనరల్ డాక్టర్ కే.జే.శ్రీనివాస తెలిపారు. లేక్ హాడ్జెస్ వేదికగా జరిగిన ఈ రన్లో చిన్న పిల్లల నుంచి సీనియర్ సిటిజన్ల వరకు ప్రవాస భారతీయ కుటుంబాలు భారీ సంఖ్యలో భాగస్వాములయ్యాయని పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా దేశానికి తమ వంతు సహకారం అందించాలని ఆయన పిలుపునిచ్చారు.