నెబ్రాస్కాలో అట్టహాసంగా తెలుగు సమితి వనభోజనాల వేడుక
రిపోర్టర్: రమేష్
స్థలం: ఒమాహా, నెబ్రాస్కా
అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రం ఒమాహాలో తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా ఆధ్వర్యంలో వనభోజనాల వేడుక ఆత్మీయ వాతావరణంలో ఘనంగా జరిగింది. యూజీన్ టి. మహోనీ స్టేట్ పార్క్లో జరిగిన ఈ వేడుకకు భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తెలుగు కుటుంబాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చాయి. TSN అధ్యక్షుడు కొల్లి ప్రసాద్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో రుచికరమైన వంటకాలు, కబడ్డీ పోటీలు, సంగీతం, నృత్యాలు మరియు చిన్నారుల ఫేస్ పెయింటింగ్ అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.