తుపాను ముప్పు వేళ అప్రమత్తత తప్పనిసరి: బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ హెచ్చరిక

రిపోర్టర్: వెంకట్ స్థలం: బాపట్ల

తుపాను ప్రభావం తీవ్రంగా ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ హెచ్చరించినట్లు బాపట్ల పోలీస్ వెల్లడించారు. ప్రాణనష్టం జరగకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఏవైనా అత్యవసర సహాయాలు కావాల్సి వస్తే ప్రజలు వెంటనే డయల్ 112 లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ను సంప్రదించాలని కోరారు.