ది ప్యారడైజ్ చిత్రంలో నా పాత్ర చాలా భిన్నంగా ఉంటుందన్న కయాదు లోహార్

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: హైదరాబాద్

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ది ప్యారడైజ్ చిత్రంలో తాను సుబ్బలక్ష్మి అలియాస్ సుబ్బు పాత్రలో నటిస్తున్నట్లు కథానాయిక కయాదు లోహార్ తెలిపారు. ఈ నెల 24న విడుదల కానున్న ఈ సినిమా తన కెరీర్లోనే పెద్ద ప్రాజెక్ట్ అని, ఇందులో నాని విశ్వరూపం చూస్తారని ఆమె పేర్కొన్నారు. నాని, శ్రీకాంత్ ఓదెల, అనిరుధ్ లాంటి ప్రతిభావంతులైన టీమ్తో పనిచేయడం గొప్ప అనుభవమని ఆమె విలేకరుల సమావేశంలో వెల్లడించారు.