'పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలి': గణేష్ ఉత్సవాలపై సీపీ స్పష్టీకరణ

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం జిల్లాలో గణేష్ మండపాల ఏర్పాటు, మండపం ప్రాంతం, నిమజ్జన వాహనాలు తదితర వివరాలను నిర్వాహకులు policeportal.tspolice.gov.in ఆన్లైన్ పోర్టల్లో ముందస్తుగా నమోదు చేసుకోవాలని సీపీ సునీల్ దత్ సూచించారు. పోలీస్ అధికారిక పోర్టల్లో ఇందుకు సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అందుబాటులో ఉందన్నారు. గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖకు నిర్వాహకులు పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు.