శ్రీరామసాగర్ జలాశయంపై ఎల్నినో ప్రభావం: నేడు బాబ్లీ గేట్ల మూసివేత

రిపోర్టర్: శివ స్థలం: నిజామాబాద్

శ్రీరామసాగర్ జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో పాటు ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండొచ్చనే హెచ్చరికలతో నీటి పారుదలశాఖ అప్రమత్తమైందని అధికారులు తెలిపారు. తాగునీటికే ప్రాధాన్యం ఇస్తూ యాసంగిలో ఆరుతడి పంటలు వేయాలని రైతులకు సూచించారు. మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను ఈనెల 29న మూసివేయనున్నారు. ఈ సీజన్లో ఇన్ఫ్లో పూర్తిగా నిలిచిపోవడంతో ఎస్సారెస్పీలో ప్రస్తుతం ఉన్న నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.