భీమిలిలో పన్నెండు వేల మంది సైనికులను తయారు చేయాలని బొత్స పిలుపు

రిపోర్టర్: సునీల్ స్థలం: విజయనగరం

భీమిలిలో పార్టీ బలోపేతం కోసం పన్నెండు వేల మంది సైనికులను తయారు చేయాలని బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ ఛాలెంజ్ను స్వీకరించాలని అనూషను కోరినట్లు ఆయన తెలిపారు. ప్రజల మద్దతుతోనే ఎన్నుకోబడ్డామని, నామినేటెడ్ పదవులు ఎప్పుడూ తీసుకోలేదని స్పష్టం చేశారు. ఏ సమస్య వచ్చినా కార్యకర్తల కోసం తామంతా అండగా వస్తామని బొత్స సత్యనారాయణ భరోసా కల్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజల్లో ఉండాలని ఆయన సూచించారు.