హైదరాబాద్‌లో పేదల కోసం ఇందిరమ్మ టవర్స్ నిర్మాణ పనులు వేగవంతం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్‌లో పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం కీలక దశకు చేరుకుంది. రాయదుర్గం, కూకట్పల్లి, షేక్‌పేట, జూబ్లీహిల్స్ వంటి ఖరీదైన ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాలను నిర్మిస్తున్నారు. తొలి దశలో 16 నియోజకవర్గాల్లో 7,680 ఫ్లాట్లను రూ.2,534 కోట్ల అంచనా విలువతో నిర్మించనున్నారు. అయితే కొన్ని నియోజకవర్గాల్లో లాటరీ ద్వారా ఎంపికైన లబ్ధిదారుల్లో స్థానికుల సంఖ్యపై అభ్యంతరాలు వ్యక్తమవుతుండటంతో అధికారులు పరిశీలిస్తున్నారు.