పాతబస్తీలో ఉద్రిక్తత: దుర్గామాత విగ్రహంపై కోడిగుడ్లతో దాడి చేసిన దుండగులు

రిపోర్టర్: రమేష్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్ నగరంలోని మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో దుర్గామాత విగ్రహ ఊరేగింపుపై గుర్తుతెలియని వ్యక్తులు కోడిగుడ్లతో దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై స్థానిక భక్తులు, హిందూ సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. వెంటనే స్పందించిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించామని, నిందితులను పట్టుకునేందుకు సీసీటీవీ టేజీలను పరిశీలిస్తూ దర్యాప్తు వేగవంతం చేశామని వెల్లడించారు.