'సామాన్యులపై ఎటువంటి భారం పడదు': యూపీఐ లావాదేవీలపై ఎన్‌పీసీఐ కీలక నిర్ణయం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: India

జాతీయ చెల్లింపుల సంస్థ (NPCI) డిజిటల్ చెల్లింపుల వ్యవస్థపై కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 15వ తేదీ నుంచి వ్యాపార లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీలను విధిస్తున్నట్లు ప్రకటించింది. రూ.2,000 కంటే ఎక్కువ విలువైన వ్యాపార లావాదేవీలపై 0.4 శాతం MDR వర్తించనుండగా, సాధారణ వ్యక్తుల మధ్య జరిగే పర్సన్-టు-పర్సన్ లావాదేవీలు మరియు యూపీఐ ఆటో పే విధానాలు పూర్తిగా ఉచితంగానే కొనసాగుతాయని, దీనివల్ల సామాన్యులపై ఎలాంటి ఆర్థిక భారం పడదని స్పష్టం చేసింది.