నెత్తురోడిన రహదారిపై ఆటోను ఢీకొన్న ట్రాలీ ఎనిమిది మంది విద్యార్థులతో సహా టీచర్ తీవ్ర గాయాలు

రిపోర్టర్: నరేష్ స్థలం: నెల్లూరు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి పరిధిలోని తోటపల్లి గూడూరు మండలం కోడూరు వద్ద పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న ఆటోను సిమెంట్ లోడు ట్రాలీ ఢీకొన్న ప్రమాదంలో ఎనిమిది మంది విద్యార్థినులతో పాటు ఓ ఉపాధ్యాయురాలు తీవ్రంగా గాయపడ్డారు. సచివాలయంలో తరగతుల పేరుతో ప్రిన్సిపాల్ మూడు ఆటోలలో విద్యార్థులను తరలిస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన టీచర్‌ను ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, విద్యార్థినులను నెల్లూరు జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.