ఏడాదిలోపే ఇందిరమ్మ ఇళ్ల తాళాలు అందిస్తామని మంత్రి పొంగులేటి వెల్లడి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: వరంగల్
పేదల సొంతింటి కలను సాకారం చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని నాంపల్లిలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలకు రానున్న ఏడాదిలోపే ఇళ్ల తాళాలు అందిస్తామని మంత్రి ధైర్యం చెప్పారు.