కోల్కతా హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Kolkata
తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి కోల్కతా హైకోర్టు ఇచ్చిన మధ్యంతర రక్షణను సవాల్ చేస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేసినట్లు రాష్ట్ర అధికార వర్గాలు వెల్లడించాయి. పలు క్రిమినల్ కేసుల్ లో అరెస్ట్ నుంచి నవంబర్ ముప్ పై వరకు రక్షణ కల్పిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని బెంగాల్ సర్కార్ తన పిటిషన్ లో కోరినట్లు అధికారులు స్పష్టం చేశారు.