రాంరెడ్డి దామోదర్ రెడ్డి ప్రథమ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన వెంకట్ రెడ్డి

రిపోర్టర్: రాజేష్ స్థలం: నల్గొండ

ఉమ్మడి నల్గొండ జిల్లా ముద్దుబిడ్డ, మాజీ మంత్రి దివంగత రాంరెడ్డి దామోదర్ రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. ఈ మేరకు ప్రజల మనిషిగా సేవలందించిన ఆయన సేవలను స్మరించుకుంటూ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేకంగా నివాళులర్పిస్తూ పోస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు మరియు అభిమానులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి తమ గౌరవాన్ని చాటుకున్నారు.