తాడేపల్లిలో వైఎస్ జగన్‌ను కలిసిన బొత్స అనూష
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: తాడేపల్లి
వైఎస్సార్‌సీపీ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త బొత్స అనూష మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవలే భీమిలి అసెంబ్లీ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన ఆమె, వైఎస్ జగన్‌కు పుష్ఫగుచ్ఛం అందజేసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతంపై చర్చించినట్లు తెలుస్తోంది.