మూడు వేల కోట్లతో కీలక ఖనిజాల పరిశ్రమలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
రిపోర్టర్: మహేష్
స్థలం: New Delhi
దేశంలో కీలక ఖనిజాల శుద్ధి రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఎనిమిది వందల పద్నాలుగు కోట్ల రూపాయలతో భారీ మూలధన మద్దతు పథకానికి ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీని ద్వారా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి దేశీయంగానే శుద్ధి ప్లాంట్ల ఏర్పాటుకు సబ్సిడీ అందించనున్నట్లు తెలిపారు.