డ్యూటీలో ఉండగా బ్రెయిన్ స్ట్రోక్తో హెడ్ కానిస్టేబుల్ అస్వస్థత
రిపోర్టర్: అశోక్
స్థలం: రాజన్న సిరిసిల్ల
విధుల్లో ఉన్న సమయంలో బ్రెయిన్ స్ట్రోక్తో తీవ్ర అస్వస్థతకు గురైన పోలీస్ హెడ్ కానిస్టేబుల్కు ఈహెచ్ఎస్ ద్వారా మెరుగైన వైద్య సహాయం అందించాలని తెలంగాణ డీజీపీ మరియు వైద్య ఆరోగ్య శాఖను కోరుతూ కేటీఆర్ ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ ఉద్యోగిని వెంటనే ఆదుకోవాలని, తక్షణమే స్పందించి బాధితుడికి అవసరమైన అన్ని రకాల వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు.