ఆదోని మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి: రోడ్డెక్కిన పెద్దహరివనం గ్రామస్తులు

రిపోర్టర్: KISHORE M స్థలం: ఆదోని

ఆదోని మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పెద్దహరివనం గ్రామ ప్రజలు రోడ్డెక్కి నిరసన తెలిపారు. గ్రామానికి చెందిన రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి వచ్చి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పంటలు దెబ్బతిని రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారని, ఇలాంటి పరిస్థితుల్లో ఆదోని మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించి ఆదుకోవాలని నిరసనకారులు ప్రభుత్వాన్ని కోరారు. కరువు ప్రకటనతో పాటు రైతులకు తగిన పరిహారం, సహాయ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.