హాంగ్ కాంగ్ సిక్సెస్ టోర్నీ: ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించిన టీమ్ఇండియా
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
హాంగ్ కాంగ్ సిక్సెస్ టోర్నమెంట్లో భారత జట్టు ప్రదర్శన అత్యంత నిరాశాజనకంగా సాగిందని నిర్వాహకులు తెలిపారు. కృనాల్ పాండ్యా నేతృత్వంలో బరిలో దిగిన టీమ్ఇండియా వరుసగా మూడు మ్యాచ్లలో ఓటమరులను చవిచూసింది. పాకిస్థాన్, యూఏఈ అలాగే ఇంగ్లాండ్ జట్ల చేతిలో పరాజయాలు ఎదురుకావడంతో భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. చివరి మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో మూడు పరుగుల తేడాతో ఓటమిపాలైందని కెప్టెన్ వెల్లడించారు.