రాజాపేట మండలంలో ధాన్యం కొనుగోళ్లు తక్షణమే ప్రారంభించాలని హెచ్చరిక

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట మండలంలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తక్షణమే కొనుగోళ్లు ప్రారంభించాలని భారతీయ కిసాన్ సంఘ్ మండల అధ్యక్షులు పారుపల్లి సంజీవరెడ్డి డిమాండ్ చేశారు. కల్లాల్లో ఉన్న పంటను దళారులకు అమ్ముకుని నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోళ్లు ఆలస్యం చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన అధికారులను హెచ్చరించారు.