పలాస రెబల్ చైర్మన్ అభ్యర్థి శ్రీజకు కేటాయించిన కొబ్బరికాయ గుర్తు
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో రెబల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దువ్వాడ శ్రీజకు ఎన్నికల సంఘం కొబ్బరికాయ గుర్తు కేటాయించింది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దువ్వాడ శ్రీను మాట్లాడుతూ పుర ప్రజలందరూ ఆమెను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అభ్యర్థి విజయమే లక్ష్యంగా నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.