హుస్నాబాద్ విద్యానగర్లో భక్తిశ్రద్ధలతో వినాయక కుంకుమ పూజలు
రిపోర్టర్: Damidi Chandra Reddy
స్థలం: హుస్నాబాద్
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ పట్టణ కేంద్రం విద్యానగర్లో సోమవారం రాత్రి వినాయకుని మండపం వద్ద మహిళలు భక్తి శ్రద్ధలతో ప్రత్యేకంగా కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టగా, ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.