బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు
రిపోర్టర్: రమేష్
స్థలం: హైదరాబాద్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కోస్తాంధ్రతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.