లద్దాఖ్‌లో సింధూ నదిపై భారత్ తొలి రాతి చెక్‌డ్యామ్ నిర్మాణం

రిపోర్టర్: కృష్ణ స్థలం: Ladakh

లద్దాఖ్‌లోని ఉప్పీ ప్రాంతంలో సింధూ నదిపై భారత్ తొలి రాతి చెక్‌డ్యామ్‌ను నిర్మించింది. సిమెంట్, కాంక్రీట్ వాడకుండా సహజ రాళ్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు 40 మిలియన్ లీటర్ల నీటిని నిల్వ చేయనుంది. దీనివల్ల స్థానిక రైతులకు సాగునీటి కష్టాలు తీరనున్నాయి. పర్యావరణహితంగా తక్కువ వ్యయంతో నిర్మించిన ఈ తరహాలో మరో 36 డ్యామ్‌లను నిర్మించేందుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. ఇది సింధూ జలాల వినియోగంలో కీలక మలుపు.