కార్మిక చట్టాలను కేంద్రం నిర్వీర్యం చేస్తోంది: నటుడు ఆర్.నారాయణ మూర్తి ఫైర్

రిపోర్టర్: శివ స్థలం: Hyderabad

కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ పేరుతో కార్మికుల హక్కులను నిర్వీర్యం చేస్తోందని ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి మండిపడ్డారు. హైదరాబాద్లో జరిగిన హుషారు రెండు సినిమా టీజర్ ఆవిష్కరణలో ఆయన మాట్లాడారు. ఐటీ కంపెనీలు యువతతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నాయని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ అవుతున్నాయని, నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.