నాగ్‌పూర్‌లో బ్యాంకులో కారంపొడి చల్లి రూ.4.5 లక్షలు లూటీ
రిపోర్టర్: శివ
స్థలం: మహారాష్ట్ర
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో సంచలనం సృష్టించిన బ్యాంకు దోపిడీ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. భాండే ప్లాట్ ప్రాంతంలోని బ్యాంకు సిబ్బందిపై కారంపొడి చల్లి రూ.4.53 లక్షల నగదును దుండగుడు అపహరించాడు. గమనించిన పెట్రోలింగ్ పోలీసులు వెంటనే స్పందించి నిందితుడు సూరజ్ బోర్కర్‌ను అదుపులోకి తీసుకున్నారు. లూటీ చేసిన సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన తాలూకు సీసీటీవీ దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యాయి.