గణిత శాస్త్రవేత్త మహేష్ కాడ్డేకు ప్రతిష్టాత్మక 2026 రామానుజన్ పురస్కారం
రిపోర్టర్: విజయ్
స్థలం: బెంగళూరు
భారతీయ గణిత శాస్త్రవేత్త, ఐఐఎస్సీ ప్రొఫెసర్ మహేష్ కాడ్డే ప్రతిష్టాత్మక 2026 రామానుజన్ పురస్కారాన్ని గెలుచుకున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. బీజగణిత సంఖ్యా సిద్ధాంతంలో ఆయన చేసిన విశేష కృషికి ఈ పురస్కారం దక్కిందని అధికారులు వెల్లడించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని యువ గణిత పరిశోధకులకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఈ బహుమతి కింద పది వేల డాలర్ల నగదును అందజేయనున్నట్లు అంతర్జాతీయ సంస్థలు పేర్కొన్నాయి.