బీఆర్ఎస్ కౌన్సిలర్పై కాంగ్రెస్ పార్టీ ఒత్తిళ్లంటూ మున్సిపల్ ఎదుట ఆందోళన

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ ఆరో వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ సల్ల కృష్ణవేణిని కాంగ్రెస్లో చేరాలని మున్సిపల్ చైర్పర్సన్ భర్త దావ రమేష్ తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారంటూ బీఆర్ఎస్ శ్రేణులు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టాయి. గత కొన్ని నెలలుగా రాజకీయ వేధింపులు తాళలేకపోతున్నామని, వార్డు ఆర్పీని కూడా అకారణంగా ఇబ్బంది పెడుతున్నారని వారు మండిపడ్డారు.