మల్కాజ్‌గిరిలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

రిపోర్టర్: సునీల్ స్థలం: మేడ్చల్

మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో గురువారం ప్రజా పాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు పారదర్శకమైన, బాధ్యతాయుతమైన పాలన అందించడం ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత అని, క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.