అమెరికాలో ఐటీ దిగ్గజాలకు భారీ షాక్: శాశ్వత లేబర్ సర్టిఫికేషన్ సస్పెండ్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: అమెరికా

అమెరికా ప్రభుత్వం టెక్ దిగ్గజాలకు భారీ షాకిచ్చిందని, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, టాటా సహా ఎనిమిది ప్రముఖ ఐటీ కంపెనీల శాశ్వత కార్మిక సర్టిఫికేషన్ను సస్పెండ్ చేసినట్లు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెల్లడించారు. వీసా కార్యక్రమం దుర్వినియోగం నేపథ్యంలోనే ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దీంతో ఆయా సంస్థల తరఫున హెచ్-వన్ బి వీసాపై అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగులు గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడం కుదరదని అధికారులు తేల్చిచెప్పారు.