యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై భారీ అంచనాలు వద్దు: రవిచంద్రన్ అశ్విన్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: న్యూఢిల్లీ
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కెరీర్ ప్రారంభంలోనే భారీ అంచనాల బరువు మోపవద్దని టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విజ్ఞప్తి చేశారు. సోనీలివ్‌తో మాట్లాడుతూ, పదిహేనేళ్ల కుర్రాడికి తగినంత శ్వాసించే వెసులుబాటు కల్పించాలని, ప్రశాంతంగా క్రికెట్‌ను ఆస్వాదించే స్వేచ్ఛ ఇవ్వాలని ఆయన సూచించారు. భవిష్యత్తులో దేశానికి స్టార్ ప్లేయర్‌గా ఎదుగుతాడని, అయితే ఇప్పుడే ఇటువంటి పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం సరికాదని అశ్విన్ పేర్కొన్నారు.