రాయలసీమ అభివృద్ధికి సరికొత్త బాట: లక్ష కోట్లతో మెగా హార్టికల్చర్ హబ్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: కృష్ణా
రాయలసీమ రైతులను ఆదుకుంటామని యువగళం పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి మంత్రి నారా లోకేష్ రాయలసీమలో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేశారని బోడే ప్రసాద్ - మాజీ ఎమ్మెల్యే పెనమలూరు వెల్లడించారు. ఇచ్చిన మాటను మంత్రి లోకేష్ నిలబెట్టుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయం ద్వారా రాయలసీమ ప్రాంతంలో ఉద్యానవన రంగం మరింత అభివృద్ధి చెందుతుందని, స్థానిక రైతులకు నూతన ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.