ఇబ్రహీంపట్నంలో యువతిని ముక్కలుగా నరికి దారుణ హత్య

రిపోర్టర్: రాజేష్ స్థలం: ఇబ్రహీంపట్నం

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం థర్మల్ పవర్ స్టేషన్ కూలింగ్ కెనాల్లో యువతి హత్యకు గురైనట్లు పోలీసులు వెల్లడించారు. మృతురాలిని మంగళగిరికి చెందిన కళ్యాణిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. పది రోజుల క్రితమే ఆమెను ముక్కలుగా నరికి కాలువలో పడేశారని పేర్కొన్నారు. వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్య జరిగినట్లు అనుమానిస్తున్న పోలీసులు, చేతిపై ఉన్న టాటూ ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.