పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సీపీ సునీల్ దత్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: చింతకాని
సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని సీపీ సునీల్ దత్ పోలీస్ అధికారులకు ఆదేశించారు. చింతకాని పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీపీ స్టేషన్లోని రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయం, వినియోగంపై నిరంతర నిఘా కొనసాగించాలని ఆయన పేర్కొన్నారు.