ఉద్యోగ రాజీనామాను తిరస్కరించిన మేనేజర్: రెడ్డెట్లో వైరల్ అవుతున్న చర్చ

రిపోర్టర్: భాస్కర్ స్థలం: హైదరాబాద్

తాను చేసిన ఉద్యోగానికి రాజీనామా చేయగా మేనేజర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని ఒక టెకీ తెలిపారు. ఉద్యోగాన్ని వదిలే ప్రసక్తే లేదని తన బాస్ తెగేసి చెప్పడంతో గందరగోళానికి గురైనట్లు సదరు ఉద్యోగి రెడ్డెట్ వేదికగా పేర్కొన్నారు. కొత్త ప్రాజెక్టులో చేరిన తరుణంలో రాజీనామా చేయడంపై సంస్థ నుంచి ఎలాంటి స్పందన వస్తుందనే దానిపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.