రాజాపేట సాయి మందిరంలో ఘనంగా వినాయక పూజలు
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండల కేంద్రంలోని శ్రీ రామకృష్ణ సాయి మందిరంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రధాన అర్చకులు చలివేదుల వెంకట రామకృష్ణ ప్రసాద శర్మ ఆధ్వర్యంలో మంగళవారం స్వామివారికి గరిక పూజ, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఉప్పల రమేష్ స్వప్న దంపతులు ఈ పూజా కార్యక్రమంలో ముఖ్య యజమానులుగా పాల్గొన్నారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.