మున్సిపల్ ఎన్నికల వేళ భారీ భద్రత: బరిలోకి ముప్పై ఆరు వేల మంది

రిపోర్టర్: రాజేష్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నవంబర్ 1న జరగనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముై ఆరు వేలకు పైగా పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని ఎనిమిది మున్సిపాలిటీల్లో ఇప్పటికే అన్ని స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన ప్రాంతాల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఓటింగ్ నిర్వహించనున్నారు.