బుచ్చిరెడ్డిపాలెంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహణ

రిపోర్టర్: మహేష్ స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండల పరిధిలోని దామరమడుగు సచివాలయం సమీపంలో వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలకు కంటి పరీక్షలు చేసి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేశారు. చేనేత ఫెడరేషన్ రాష్ట్ర డైరెక్టర్ కె.వి. శేషయ్య మాట్లాడుతూ నెల్లూరు నియోజకవర్గ పరిధిలో ఇప్పటివరకు లక్షా ఇరవై మూడు వేల మందికి పైగా ఉచిత కంటి పరీక్షలు పూర్తి చేసి వేల మందికి కళ్లద్దాలు అందజేశామని తెలిపారు.