అమెరికన్ తెలుగు అసోసియేషన్ బోర్డు ట్రస్టీల ఎన్నికలకు నామినేషన్ల ఆహ్వానం

రిపోర్టర్: సురేష్ స్థలం: అమెరికా

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) బోర్డు ఆఫ్ ట్రస్టీ స్థానాల భర్తీకి నామినేషన్ల ప్రక్రియను అధికారికంగా ప్రారంభించినట్లు నామినేటింగ్ కమిటీ చైర్పర్సన్ మధు బొమ్మినేని తెలిపారు. సంస్థ రాజ్యాంగంలోని ఆర్టికల్ III ప్రకారం 2027–2030 కాలానికి మొత్తం 16 ట్రస్టీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అక్టోబర్ 15, 2026 వరకు నామినేషన్లను స్వీకరిస్తామని, ఆసక్తి గల సభ్యులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.