స్వచ్ఛమైన బడుల లక్ష్యంగా చెత్త నిర్వహణపై కేంద్ర విద్యాశాఖ అవగాహన
రిపోర్టర్: హరి
స్థలం: New Delhi
పాఠశాలల్లో సరైన చెత్త నిర్వహణపై విద్యార్థులకు అవగాహన కల్పించేలా కేంద్ర విద్యాశాఖ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. గ్రీన్, బ్లూ, రెడ్, బ్లాక్ రంగుల డస్ట్ బిన్లలో , , మరియు ప్రత్యేక అవసరమైన వ్యర్థాలను వేర్వేరుగా వేయాలని సూచించింది. కాలువలు, పాఠశాల ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచుతూ విద్యార్థులు పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని పేర్కొంది. వ్యర్థాల తగ్గింపు, పునర్వినియోగాన్ని ప్రోత్సహిస్తూ పరిశుభ్రమైన, స్థిరమైన భవిష్యత్తు కోసం అందరూ కలిసి రావాలని Ministry of Education పిలుపునిచ్చింది.