సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన

రిపోర్టర్: కృష్ణ స్థలం: World

దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం 16 మంది సభ్యులతో కూడిన ఆస్ట్రేలియా జట్టును ప్రకటించారు. గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో ఇబ్బందిపడుతున్న మార్నస్ లబుషేన్‌కు సెలక్టర్లు మరో అవకాశం కల్పించారు. మాజీ దిగ్గజాల విమర్శల మధ్య కూడా అతనికి జట్టులో చోటు దక్కింది. అలాగే కుపర్ కొనేలీ, మైఖేల్ నేసర్, మాథ్యూ కుహ్నెమన్‌లకు జట్టులో స్థానం లభించింది.