ఐదు రోజుల్లోనే ఆరు లక్షలకు పైగా పింఛను దరఖాస్తులు
రిపోర్టర్: సురేష్
స్థలం: అమరావతి
ఏపీలో ఎన్టీఆర్ భరోసా పింఛను పథకం కింద సామాజిక భద్రత పింఛన్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించిన కేవలం ఐదు రోజుల్లోనే 6.81 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో అత్యధికంగా వృద్ధాప్య పింఛను కేటగిరీ కింద 3.76 లక్షలు, వితంతు పింఛను కోసం 1.65 లక్షల మంది దరఖాస్తులు సమర్పించారు.