గాజువాకలో నీట్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం

రిపోర్టర్: santhoshkumar స్థలం: గాజువాక

విశాఖపట్నం జిల్లా గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని సెలెస్ట్ అపార్ట్మెంట్స్లో ఐఐటీ-నీట్ కోచింగ్ తీసుకుంటున్న రూపేష్ అనే విద్యార్థి మూడవ అంతస్తు నుండి కిందకు దూకాడు. తీవ్ర గాయాలపాలైన అతన్ని కుటుంబ సభ్యులు వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం ఆ విద్యార్థి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న గాజువాక పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి, దర్యాప్తును వేగవంతం చేశారు.