బస్వాపూర్‌లో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: కోహెడ
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలను సోమవారం పద్మశాలి సేవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక సర్పంచ్ భూక్యా లింగం నాయక్ హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.