రగ్గ్‌డ్ లుక్‌లో నాని.. ది ప్యారడైజ్ కొత్త పోస్టర్ విడుదల
రిపోర్టర్: మహేష్
స్థలం: హైదరాబాద్
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'ది ప్యారడైజ్'. ఈ నెల 24న పాన్ ఇండియా స్థాయిలో సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ గురువారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో నాని పొడవాటి జడలు, గడ్డంతో చేతిలో తుపాకీ పట్టుకొని రగ్గ్‌డ్ లుక్‌లో కనిపించి అభిమానులను ఆకట్టుకుంటున్నారు.