దీపావళి వేళ బంగారం ధరలకు రెక్కలు: ఒక్కరోజే భారీగా పెరిగిన పసిడి
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
దీపావళి పండుగ వేళ బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వినియోగదారులకు ధరల పెరుగుదల ఆందోళన కలిగిస్తోందని ఆగ్మాంట్ సంస్థ వెల్లడించింది. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో పసిడి, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయని తెలిపింది. ఒక్కరోజే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర మూడు వేల నూట అరవై రూపాయలు పెరగ్గా, కిలో వెండి ధర పది వేల మేర పెరిగినట్లు సంస్థ పేర్కొంది. పండుగ సమయంలో ధరల పెరుగుదల సామాన్యులపై భారం మోపుతోంది.