ఆయుర్వేద వైద్య సేవలను విస్తరించిన కేంద్ర మోదీ ప్రభుత్వం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Amaravati

దేశంలో ఆయుర్వేద మరియు ఆయుష్ వైద్య సేవలను కేంద్ర ప్రభుత్వం విస్తరించింది. 2014 నుంచి మోదీ సర్కార్ చేపట్టిన చర్యలతో ప్రజలకు ఆరోగ్య సేవలు మరింత చేరువయ్యాయి. దేశవ్యాప్తంగా 12,500 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు, 13,249 ప్రజా ఆరోగ్య కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. అలాగే 25,322 ఆయుష్ వైద్యులు, 5,666 పారామెడికల్ సిబ్బందితో సంప్రదాయ వైద్యం మరింత విస్తృతమైందని బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ వెల్లడించింది.