దీపావళి వేళ ఎఫ్‌డీఏ కొరడా: వందకు పైగా ఫుడ్ లైసెన్సులు రద్దు
రిపోర్టర్: నరేష్
స్థలం: Mumbai
దీపావళి పండుగను పురస్కరించుకుని మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అమినిస్ట్రేషన్ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక తనిఖీల్ లో నూట ఐదు ఫుడ్ బిజినెస్ లైసెన్సులను సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించిన ఏడు సంస్థలను పూర్తిగా మూసివేయాలని ఆదేశించారు. ముంబైలో జెప్టో,బ్లింకిట్ వంటి ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లతో పాటు పలు ప్రసిద్ధ ఫుడ్ చెయిన్లపై ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రజా ఆరోగ్యంతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని ఎఫ్‌డీఏ కమిషనర్ తుకారాం ముండే హెచ్చరించారు.